రోడ్డు ప్రమాదంలో వరంగల్‌ నిట్‌ విద్యార్థి మృతి

–  ఐదుగురికి తీవ్ర గాయాలు..
నవతెలంగాణ కాజీపేట
రోడ్డు ప్రమాదంలో వరంగల్‌ నిట్‌(జాతీయ సాంకేతిక విద్యాలయం) విద్యార్థిని నిస్సీ మృతిచెందిన సంఘటన ములుగు జిల్లా జంగాలపల్లి వద్ద గురువారం ఉదయం జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిట్‌కు చెందిన బీటెక్‌ సివిల్‌ ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరానికి చెందిన ఆరుగురు విద్యార్థులు బుధవారం ఉదయం అద్దె కారులో లక్నవరం విహారయాత్రకు వెళ్లారు. ఆ రోజు అక్కడే ఒక కాటేజీలో బస చేసి గురువారం తెల్లవారుజామున హన్మకొండ వైపు అతి వేగంగా వస్తున్న కారు.. జంగాలపల్లి క్రాస్‌ రోడ్‌ వద్ద అదుపుతప్పి డివైడర్‌ను ఢకొీట్టి దూసుకెళ్లి ఆపై లారీని ఢ కొట్టింది. ఈ ప్రమాదంలో ఏలూరుకు చెందిన విద్యార్థిని నిస్సి అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఐదుగురు విద్యార్థుల్లో హైదరాబాద్‌కు చెందిన ముర్తుజా, ఉమర్‌, సాయి, సుజిత్‌, విశాఖకు చెందిన శ్రేయకు తీవ్రగాయాలయ్యాయి. వీరికి ములుగు ప్రాంతీయ వైద్యశాలలో ప్రథమ చికిత్స అందించి అనంతరం వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.