వారియర్స్‌ గెలుపు బాట

Warriors are on a winning streak– 40-38తో స్టీలర్స్‌పై గెలుపు
– ప్రొ కబడ్డీ లీగ్‌ సీజన్‌ 11
హైదరాబాద్‌: బెంగాల్‌ వారియర్స్‌ వరుస టైలకు ముగింపు పలుకుతూ గెలుపు బాట పట్టింది. ఆదివారం గచ్చిబౌలిలోని జిఎంసి బాలయోగి ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ప్రొ కబడ్డీ లీగ్‌ 11వ సీజన్‌ మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌పై 40-38తో బెంగాల్‌ వారియర్స్‌ మెరుపు విజయం సాధించింది. ఆరంభంలో వెనుకంజ వేసినా.. రెయిడర్‌ మణిందర్‌ సింగ్‌ (12 పాయంట్లు) సూపర్‌ టెన్‌ షోతో బెంగాల్‌ వారియర్స్‌ దూకుడు పెంచింది. వారియర్స్‌ తరఫున సుశీల్‌ (4 పాయింట్లు), ప్రవీణ్‌ కుమార్‌ (4 పాయింట్లు), ఫజల్‌ (4 పాయింట్లు) రాణించారు. హర్యానా స్టీలర్స్‌ రెడియర్‌ వినరు (10 పాయింట్లు) సూపర్‌ టెన్‌తో మెరువగా.. ఆల్‌రౌండర్‌ మహ్మద్‌ రెజా (9 పాయింట్లు), నవీన్‌ (6 పాయింట్లు) ఆకట్టుకున్నారు. బెంగాల్‌ వారియర్స్‌కు పీకెఎల్‌ 11లో ఇది ఐదు మ్యాచుల్లో రెండో విజయం. హర్యానా స్టీలర్స్‌కు ఇది ఐదు మ్యాచుల్లో రెండో పరాజయం.