మురుగు నీరు నిల్వ ఆరోగ్యానికి ముప్పు

– గ్రామపంచాయతీ ముందే ఈ దుస్థితి

నవతెలంగాణ – ఉప్పునుంతల

పంచాయతీ కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ అధికారుల నిర్లక్ష్యం, చోద్యం చూస్తున్న పాలకులు, సంబంధిత అధికారుల పర్యవేక్షణ శూన్యం, హౌస్ లో తోక పురుగులు జీవనం నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలం గువ్వలోనిపల్లి గ్రామంలో గ్రామపంచాయతీ కార్యాలయం ముందు పశువులు, గొర్లకు త్రాగునీరు అవసరాలకు కొన్ని ఏళ్ల క్రితం నిర్మించి ఏర్పాటుచేసిన నీళ్ల హౌస్ కొన్ని నెలలుగా నీరు తొలగించకపోగా హౌస్ శుభ్రతకు నోచుకోక మరుగున పడిన నీరు పచ్చగా మారి చెత్త చెదారం చేరి తోకపురుగులతో మంగళవారం పూర్తి అపశుభ్రంగా మారి దర్శనమిచ్చింది. పర్యావాసనంగా, పేరుకపోయిన కలుషిత నీరు దుర్వాసనను సృష్టిస్తుంది, దోమలను ఉత్పత్తి చేస్తుంది మరియు రోగాలను వ్యాప్తి చేస్తుంది మరియు నివాసితులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుంది. ఇది దోమల పెంపకానికి అనువైన ప్రదేశం గా మారడానికి దారి తీస్తుంది. శానిటేషన్ డ్రైవ్ పై జిల్లా పంచాయతీ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా పాటు స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టాలని అధికారులు పలు సూచనలు ఇస్తుంటారు. గ్రామపంచాయతీలోని ప్రతి ఇల్లు వాడ దోమల నివారణకు పాటించేలా అవగాహన కల్పించేవారు. స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్లు సూచనలు, మార్గదర్శకాలు విధిగా పాటించి స్పెషల్ డ్రైవ్ ను విజయవంతం చేయాలని అధికారులకు సూచించేవారు. గ్రామపంచాయతీలోనీ సిబ్బంది వీధులను శుభ్రం చేసి ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం కూడా అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని అధికారులు మాటల్లో వినాల్సిందే కానీ ఇక్కడ అధికారులు ఆదేశాలను బేక తారు చేస్తూ విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు ఈ చిత్రంలో ఉన్న మురుగునీరు గ్రామపంచాయతీ ముందే ఉండడం విచారకరంగా వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత గ్రామపంచాయతీ కార్యదర్శి, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పాలకులు స్పందించి మురుగునీరు నిలువ లేకుండా తగు చర్యలు తీసుకుని గ్రామంలో నివసిస్తున్న కుటుంబాలకు ప్రజలకు, మూగజీవులకు ఆరోగ్యమైన నీటిని వినియోగంలోకి తేవాలని పలువురు చూచిస్తున్నారు.