ముఖం చాటేసిన వర్షాలని పిలుస్తూ.. దేవుళ్లకు జలాభిషేకాలు

నవతెలంగాణ – ఆళ్ళపల్లి: గత 20 రోజులుగా ముఖం చాటేసిన వర్షాలను పిలుస్తూ వరుణదేవుడికి జలాభిషేకం శనివారం మండలంలోని లక్ష్మీపురం గ్రామ ప్రజలు చేశారు. రైతులు వేసిన పంటలు నీరులేక ఎండిపోతున్నాయని, వర్షాలు సంమృద్ధిగా కురవాలని గ్రామ దేవతలకు గ్రామ ప్రజలు మొక్కుకున్నారు. వర్షాలు కురవకపోవడంతో పత్తి, మొక్కజొన్న, వరి, ఇతర పంటలు ఎండిపోతున్నాయి. మరో నాలుగు రోజులు వర్షాలు కురవకపోతే వేసిన పంటలు చేతికిరావని రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా వరుణుడు కరుణించాలని జలాభిషేకం, పూజలు చేశారు.