
నవతెలంగాణ- నసురుల్లాబాద్
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గ్రామపంచాయతీ మంచినీటి చేతి పంపు బోరు బావి నుంచి నీరు దానంతట అదే ఉబికి వస్తున్న దశ్యం అటుగా వెళ్ళే వాహనదారులకు, గ్రామస్తులకు ఆకట్టుకుంటుంది. కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలోని నస్రుల్లాబాద్ మండల కేంద్రం లోని బాన్సువాడ వెళ్లే రహదారి పక్కనే పిండి వద్ద గ్రామస్తుల మంచినీటి సౌకర్యం కొరకు గ్రామపంచాయతీ వారు చేతి పంపును గత ఐదు సంవత్సరాల క్రితం బోరు తవ్వించారు. ఇటీవల కురిసిన వర్షాలకు చేతి పంపును ఆడించకుండానే దానంతట అవే పాతాళగంగ పైకి వస్తూ బాన్సువాడ బోధన్ వెళ్లే రహదారి మార్గమధ్యంలో రోడ్డు పక్కగా దశ్యాలు కనిపిస్తుండడంతో అటుగా వెళ్ళే వాహన చోదకులను, ప్రజలను ఆకట్టుకుంటోంది. అనేకమంది అలా వస్తున్న నీటిని నీళ్ల బాటిల్స్‌లో పట్టుకొని తమ వెంట తీసుకు వెళుతున్నారు. అదేవిధంగా సమీపంలోని మరొక బోరు బావి నుండి కూడా ఇదే విధంగా పాతాళగంగా ఉబికి పైకి వస్తున్న దశ్యాలు అందరిని ఆకట్టుకుంటున్నాయి.