శాఖ గ్రంథాలయానికి వాటర్ ఫ్రిడ్జ్ అందజేత

– సంతోషం వ్యక్తం చేస్తున్న లీడర్స్
నవతెలంగాణ – జమ్మికుంట
జమ్మికుంట శాఖ గ్రంథాలయాన్ని గత వారం రోజుల క్రితం జిల్లా అదనపు కలెక్టర్   ప్రపుల్ దేశాయ్ ఆకస్మికంగా సందర్శించి రీడర్స్ యొక్క సమస్యలను తెలుసుకున్నారు. చదువరుల సౌకర్యార్థం ఇక్కడ వివిధ ఉద్యోగ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారి  కోరిక మేరకు వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని వాటర్ ఫ్రిడ్జ్, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు , రీడింగ్ ప్యాడ్స్  అదనపు కలెక్టర్ పంపించగా, వాటర్ ఫ్రిడ్జ్ ను గ్రంథ పాలకురాలు ఎంకే లక్ష్మి శనివారం ప్రారంభించారు. ఇంకా గ్రంథాలయా పాఠకులకు ఎలాంటి అవసరాలు ఉన్న తక్షణమే నెరవేరుస్తామని హామీ ఇచ్చారని గ్రంథ పాలకురాలు తెలిపారు. అదనపు కలెక్టర్ కు గ్రంథపాలకురాలు, సహాయకురాలు బుర్రవాణి ,పాఠకులు కృతజ్ఞతలు తెలిపారు.