కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రత్నం కష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘రూల్స్ రంజన్’. అగ్ర నిర్మాత ఏ.ఎం.రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టై న్మెంట్ పతాకంపై దివ్యాంగ్ లవానియా, మురళి కష్ణ వేమూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రింకు కుక్రెజ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అమ్రిష్ గణేష్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి రెండో పాట విడుదలైంది. ‘సమ్మోహనుడా’ లిరికల్ వీడియోని చిత్ర బందం గురువారం ఉదయం విడుదల చేసింది. నాయకానాయికలపై చిత్రీకరించిన శంగార గీతమిది. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి మధ్య కెమిస్ట్రీ చక్కగా కుదిరింది. అలాగే ఒకరిపై ఒకరికి ఉన్న మోహాన్ని తెలియజేస్తూ నిప్పు, నీరు నేపథ్యంలో పాటను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటోంది. అమ్రిష్ గణేష్ స్వరపరిచిన సంగీతం ఓ కొత్త లోకంలోకి తీసుకెళ్లేలా అద్భుతంగా ఉంది. ఈ పాట విడుదల సందర్భంగా దర్శకుడు రత్నం కష్ణ మాట్లాడుతూ, ‘హైదరాబాద్‌లో వేసిన నాలుగు ప్రత్యేక సెట్స్‌లో ఈ పాటను చిత్రీకరించాం. పాటలో ముంబై, రష్యాకి చెందిన డ్యాన్సర్స్ కనిపిస్తారు. శిరీష్ అనే కొత్త కొరియోగ్రాఫర్ ఈ సినిమా ద్వారా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రంలోని ఐదు పాటలకూ ఆయనే నత్య దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. శ్రేయ ఘోషల్ ఆలపించిన ఈ పాటకి నేను, రాంబాబు గోసాల కలిసి సాహిత్యం అందించాం’ అని అన్నారు.