సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం

– చెర్కుపల్లి లో చలివేంద్రం ప్రారంభం  

నవతెలంగాణ – డిండి  
సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం అని ప్రజలు చలివేంద్రంను సద్వినియోగం చేసుకోవాలని అడపాలా జంగారెడ్డి అన్నారు. శనివారం డీ న్యూస్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని రిబ్బన్ కట్ చేసి ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సమస్త జీవకోటికి నీరే ప్రాణాధారం అని, మండుతున్న ఎండలని దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్కరు నీటిని సాధ్వినియోగ చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమములో గ్రామస్తులు బత్తిని శ్రీనివాస్ రెడ్డి, అడపాల తిరుపతిరెడ్డి తూం వెంట్ నారాయణరెడ్డి, ముత్యాల శశిధర్ రెడ్డి  డాక్టర్ సాగి రాధాకృష్ణమూర్తి, కావేటి ప్రసాద్, మీసాలా రామచంద్రయ్య, గోరటి అంజయ్య, ముడి ఆంజనేయులు గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.