
– ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉండాలి…
– జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
జీవకోటికి నీరే ప్రాణధారమని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటరావు తెలిపారు. శుక్రవారం ప్రపంచ నీటి దినోత్సవ సందర్బంగా జిల్లా కలెక్టరేట్ ఉద్యోగులకు ఇంకుడు గుంతల నిర్వహణపై అవగహన కల్పించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని గ్రామాలు, మున్సిపాలిటీలో ప్రతి ఇంటిలో ఇంకుడు గుంత ఉంటేలా అధికారులు అవగహన కల్పించాలని తెలిపారు. మానవులు చేసిన తప్పిదం వల్ల నేడు నీటి సమస్యలు ఎదుర్కొంటున్నాం అని అన్నారు. నీటిని కొనుకొని త్రాగే స్టాయికి వచ్చామని, ఉన్న వనరులను జాగ్రత్తగా వాడుతూ భవితరాల భవిష్యత్తు కోసం ప్రతి నీటి బొట్టుని మనం కాపాడాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉందని దీనికోసం ప్రతి ఒక్కరు నీటి వృధాగా పోకుండా ఒడిసి పట్టుకోవాలని దీనికి ప్రతి ఒక్కరు కంకణ బద్దులై ఉండాలని కలెక్టర్ తెలిపారు. నీరు వృదాగా పోకుండా ప్రతి ఇంటిలో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, గ్రామ, మండల కేంద్రాలలో సముహిక ఇంకుడు గుంతలు విరివిగా నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిఆర్‌డివో మధు సూదన్ రాజ్, జెడ్పీ సీఈవో వి వి అప్పారావు ,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ , కలెక్టరేట్ ఏవో సుదర్శన్ రెడ్డి ,సూపరిటీడెంట్ పద్మారావు, ఎన్నికల పర్యవేక్షకులు శ్రీనివాసరాజ్, ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.