– ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో నిల్
– సాదారణ వర్ష పాతంతో ఎగువ నుండి నీరు చేరక పోవడమే కారణం
– ప్రతి ఏటా నీటితో నిండుకుండలా ఉండేది
– మండలంలో చెరువులు, కుంటలలో చుక్కనీరు లేదు
– పాడీ, పంటలకు కష్టమే అంటున్న రైతన్నలు
నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని మద్యతరహ ప్రాజేక్ట్ అయిన కౌలాస్ నాళా ప్రాజేక్ట్ ప్రస్తుతం చుక్క నీరు ఎగువ నుండి నీరు రాక పోవడంతో మృగశిర కార్తీ నుండి సాదారణ వర్ష పాతం నమేాదు కావడంతో కళా విహినంగా కన్పిస్తోంది. అదేవిధంగా మండలంలో ముప్పైరెండు(32) చెరువులు, ఇరువై ఎనమిది (28) కుంటలు, ఆరు(6) చెక్ డ్యామ్ లు ఉన్నాయి వాటి పరిస్థితి కూడా ఇదే దుస్థితి ఉండటంతో పశువులకు త్రాగడానికి నీరు లేక పని ప్రదేశం నుండి పనిచేస్తున్న పశువులకు ఇంటికి తోలుకొచ్చి త్రాగు నీటీనీ రైతులు పశువులకు అందించి త్రాగిస్తున్నారు. ప్రతి ఏటా తొమ్మిదేండ్లుగా మృగశీర కార్తీ జూన్ మెుదటి లేదా రెండు మూడు వారంలో పూర్తీ స్థాయిలో నిండు కుండలా నీటుతో నిండి జలకళ తో ప్రాజేక్ట్ ఉండేది. కానీ నేడు వాస్తవంగా విరుద్దంగా కౌలాస్ నాళా ప్రాజేక్ట్ కళావిహీనంగా యాత్రీకులు లేక అద్వానంగా కన్పిస్తు ఉంది . ప్రాజేక్ట్ పూర్తీ స్థాయి నీటి సామర్థ్యం నాలుగు వందల యాబై ఎనమిది (458 ) మీటర్లు కాగా, సామర్థ్యం ఒకటి పాయింట్ రెండుమూడూ ఏడు ( 1. 237 ) టీఎంసీ జూలై 15వ తేది ఉదయం ఆరు గంటల నాటికి నాలుగు వందలు పాయింట్ నలుపై
( 454.40) మీటర్ అంటే డెడ్ స్టోరేజికి వచ్చి చేరింది . ప్రతి ఏటా జూలై 20 తేదినుండి 24 వ తేది వరకు పంటలకు కుడి, ఎడమ కాలువలు మరియు ఆరు డిస్ట్రీబ్యూటరి డీ1నుండి డీ6 కాలువల ద్వారా పంటలకు అధికారులు విడుదల చేసేవారు. ప్రస్తుత నాటీ పరిస్థితి నేడు లేదు. కుడి కాలువ ద్వారా మూడు వేలు(3 వేల) ఎకరాల సాగు చేస్తే , ఎడమ కాలువ ద్వారా ఎనమిది వేల ఏడువందల (8700) ఎకరాల మెుత్తం కలిపి తొమ్మిది వేలు (9వేల) ఎకరాలు సాగులో ఉంది. జుక్కల్ మండలంలో ఐదువేల రెండు వందల (5200) ఎకరాలు సాగు కాగ, బిచ్కుంద మండలంలో మూడు వేల నాలుగు వందల (3400) ఎకరాలు సాగు అవుతున్నదని ప్రాజేక్ట్ ఏఈ రవిశంకర్ నవతెలంగాణతో తెలిపారు.
2024 – 25 సంనత్సరానికి గాను రాష్ట్ర ప్రభూత్వంనకు ప్రాజేక్ట్ నిర్వహణ ఖర్చులకు మూడులక్షల పది వేల రూపాయల అంచనాలు నీటీ పారుదల శాఖ పంపడం జర్గింది. ప్రస్తుతం టెండర్ దశలో ఉందని , కాలువల మరమత్తులు , ప్రాజేక్ట్ రోడు, 10కోట్ల 90 లక్షల అంచనా వ్యయంతో కేంద్ర అధికారుల గైడ్ లైన్స్ ప్రకారం కేంద్ర, రాష్ట్రం వాటాల ప్రకారం అంచనాలు పంపడం జర్గిందని మంజూరు దశలో ఉందని కౌలాస్ నాళా ప్రాజేక్ట్ ఏఈ రవి శంకర్ పేర్కోన్నారు. ఈ ఖరీఫ్ సీజన్ మెుదటి విడతలో వరి నాట్లు వెసేందుకు జీరో పాయింట్ ఒక టీఎంసీ (0.1TMC) నీరు ఉందని , అత్యవసర సమయం లో మాత్రమే ప్రత్యేక పరిస్థితులలో నీటీ విడుదల పంటలకు చేయడం జర్గుతుంది ప్రాజేక్ట్ అధికారులు తెలియచేసారు. ఈ ఏడాదీ ఇలాగే కొనసాగీతే రబీ పంట యాసంగీ పైన ప్రబావం భారీగా ఉంటుందని ఆయాకట్టు రైతులకు తీరని నష్టం ఉందని బావించాల్సీ ఉంది. ఇప్పడికైన వరుణుడు కరుణించేనా … కౌలాస్ ప్రాజేక్ట్ , మరియు చెరువులు, కుంటలు, చెక్ డ్యాం లు నిండేనా … ఆశలు అడిఆశాలయ్యేనా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మండల రైతులు. వరుణుడు కరుణించి పచ్చని పంటలు పండి రైతులకు సుఖ సంతోషాలు పంచాలని గ్రామాలలో గ్రామ దేవతలకు పూజలు నిర్వహిస్తున్నారు.