నాగార్జున సాగర్ ఎడమ కాలువకు నీటి విడుదల..

Water release to left canal of Nagarjuna Sagar..– పాలేరు రిజర్వాయర్ పరిధిలోని ప్రజలకు తాగునీటి కోసం 500 క్యూసెక్కులు విడుదల
నవతెలంగాణ – పెద్దవూర
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం పొట్టిచేలిమ సమీపంలోనీ బెట్టేలతండా వద్ద ఎడమ ఎర్తు రెగ్యులేటర్ సాగర్ ఎడమ కాల్వకు శుక్రవారం ఎన్నేస్పీ అధికారులు ఖమ్మం జిల్లా పాలేరు రిజర్వాయర్ పరిధిలోనీ గ్రామాల ప్రజలకు తాగునిటీ అవసరాలకు 500 క్యూసెక్కుల నీటిని పాలేరు రిజర్వాయర్ లోకి ఎన్ఎస్పీ డీఈ గోపినాథ్, ఏఈ క్రిష్ణయ్య విడుదల చేశారు. త్రాగునీటి అవసరాల మేరకు నీటి పారుదల శాఖ ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు 500 క్యూసెక్కుల నీటి ఒక గేటు ద్వారా విడుదల చేశారు. ఈ నీటి క్రమక్రమంగా పెంచుకుంటూ 3వేల క్యూసెకుల మేరకు నీటి  విడుదల నాలుగు రోజుల పాటు కొనసాగించనున్నారు. ఎడమ కాల్వకు త్రాగునీటి అవసరాల కోసం 1.5 టిఎంసి ల మేరకు నీటి విడుదల చేయనున్నారు. తాగునీటి అవసరాల కొరకు మాత్రమే ఈ నీటిని ఉపయోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. మేజర్లకు ఎలాంటి నీటి విడుదల ఉండదని అధికారుల స్పష్టం చేశారు. నాగార్జున సాగర్ జలాశయం మొత్తం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 505.10 అడుగులుగా ఉంది మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీ ఎం సీ లు ఉండగా ప్రస్తుతం 123.50టీ ఎంసీ లుగా ఉంది నాగార్జున సాగర్ జలాశయం కు ఎలాంటి ఇన్ ఫ్లో లేదు జలాశయం నుండి హైద్రాబాద్ కు తాగు నీటి అవసరాల కోసం ఎస్ ఎల్బీ సీ ద్వారా 800 క్యూసెక్కుల నీరు కుడి కాలువ కు 5,700 క్యూసెక్కుల నీరు సాగర్ ఎడమ కాల్వ కు 500 క్యూసెక్కుల నీరు విడుదల కొనసాగుతుంది.
మొత్తం, 7 వేల క్యూసెక్కుల నీటిని కుడి, ఎడమ కాలువ, ఎస్ఎల్బీసీ ద్వారా నీటివిడుదల చేస్తున్నారు.