నవతెలంగాణ – గోవిందరావుపేట
ఆరు బయట పాత్రలలో ఎక్కువ కాలం నీరు నిలువ ఉండడంవల్ల వ్యాధులు సంక్రమించే అవకాశం ఉందని జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఏ అప్పయ్య అన్నారు.
ప్రస్తుత వర్షాకాలం మధ్యలో ఉన్నప్పటికీ ఆరోగ్యశాఖ తరఫున కాలానుగుణంగా వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తతే అవసరమని అవగాహన కల్పిస్తూ గురువారం పసర గ్రామపంచాయతీలో డాక్టర్ సుహాన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని డిఎంహెచ్ఓ డాక్టర్ ఏ అప్పయ్య పరిశీలించడం జరిగింది. అప్పటివరకు 52 పేషెంట్లను పరీక్షించగా అందులో ఐదుగురికి జ్వరాలతో బాధపడుతున్నట్లు నమోదు చేయడం జరిగింది. వారికి మలేరియా ఆర్డిటి డెంగ్యూ ఆర్డిటి పరీక్షలు నిర్వహించడం జరిగింది తర్వాత అభ్యుదయ కాలనీలో గల రెండు వీధులలో ఇంటింటికి వైద్య సిబ్బందితో కలిసి ప్రతి ఇంటి ఆవరణలో నీటితో నిల్వ ఉన్న పాత్రలలో లార్వా గురించి ఆరా తీసి చూసిన 15 ఇళ్లల్లో 10 ఇళ్లల్లో లార్వా ఉండడం గమనించి కుటుంబ యజమానులకు అవగాహన కల్పించి దోమలు పెరగడానికి గల కారణం మన ఇంటి ఆవరణలో ఉంచే గోలల్లో తొట్లల్లో డ్రమ్ములలో వాడి పడేసిన టైర్లలో ప్లాస్టిక్ గ్లాసులలో పెరుగుతాయని కాబట్టి ప్రతి మూడు నుండి నాలుగు రోజులు లార్వాను గమనించి నీటిని పడబోయాల్సిందిగా ప్రజలను ఉద్దేశించి డి ఎం ఎన్ హెచ్ ఓ మాట్లాడారు తర్వాత ఈరోజు నుండి జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలో శ్యామ్ మామ్ పిల్లల పరీక్షించే కార్యక్రమంలో భాగంగా అభ్యుదయ కాలనీలో గల అంగన్వాడి సెంటర్ ను సందర్శించి పిల్లలని పరీక్షించడం జరిగింది. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుహానా అంగన్వాడి సూపర్వైజర్ టీచర్స్ మరియు ఏఎన్ఎం సంపూర్ణ ఆశలు పాల్గొన్నారు.