నవతెలంగాణ – అశ్వారావుపేట
నీటి ఎద్దడి తో వేసారిన కొత్తూరు గ్రామస్థులు రోడ్డు ఎక్కడంతో ఎం.పి.డి.ఒ శ్రీనివాస్,పంచాయితీ ప్రత్యేక అధికారి,ఎ.ఓ నవీన్ లు తక్షణమే నీటి సరఫరా చేయడం కోసం ఏర్పాట్లు చేసారు. దీంతో శనివారం సాయంత్రం కార్యదర్శి ఎస్.బాబురావు ట్యాంకర్ లు తో కొత్తూరు లో వీధి వీధికి నీటి సరఫరా చేసారు.దీంతో గ్రామస్తులు తాత్కాలిక నీటి సరఫరాను వినియోగించుకున్నారు.