
నవతెలంగాణ – రెంజల్
రెంజల్ మండలం కందకుర్తి జిల్లా పరిషత్ పాఠశా ల ఆవరణ మొత్తం నీరు నిండిపోవడంతో పాఠశాలకు వచ్చే విద్యార్థులు నాన్న అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోంది. ప్రతి ఏటా వర్షాకాలం రావడంతో ఆవరణ మొత్తం జలమయం కావడంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. గతంలో ఎంపీ కవితక్క ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి పనులు చేపట్టినప్పటికీ, ఆవరణ మాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. అభివృద్ధి పనులకు సంబంధించిన లక్ష ఈ ఆవరణలోనే ఏర్పాటు చేయడం శోచనీయం. ఈ ఆవరణలో సంబంధిత శాఖ అధికారులు కానీ, గ్రామ అభివృద్ధి కమిటీ కానీ మొరం పనులు చేపట్టి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.