– చేవెళ్ల మండలంలో నిరసన
నవతెలంగాణ చేవెళ్ల
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరు గ్రామంలోని దళిత వాడలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, సమస్యను పరిష్కరించాలని రోడ్డుపై బైటాయించి గ్రామస్తులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ప్రత్యేక పాలన కొనసాగుతున్నందున ఎవరికి చెప్పాలో తెలియక, అధికారులు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదురైందని తెలిపారు. మార్చి నెలలోనే ఈ విధంగా ఉంటే ఏప్రిల్, మే నెలలో పరిస్థితి ఏంటనీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాగా, గ్రామస్తుల ఆందోళనతో స్పందించిన ప్రత్యేక అధికారులు.. వారికి ట్యాంకర్ల ద్వారా నీటిని అందజేశారు