తిరువనంతపురం: వాయనాడ్ కొండచరియలు విరిగి పడిన విపత్తు ప్రాంతంలో సోమవారం కూడా గాలింపు చర్యలు కొనసాగాయి. ముఖ్యంగా ఇంకా ఆచూకీ తెలియనివారి కోసం ఈ గాలింపు కొనసాగింది. ఎన్‌డీఆర్‌ఎఫ్, పోలీసు, ఫైర్, రెస్క్కూ సర్వీసెస్, సివిల్ ఢిఫెన్స్ ఫోర్స్, ఫారెస్టు డిపార్ల్‌మెంట్, వాలంటీర్లతో కూడిన బృందం ఈ గాలింపు చర్యల్లో పాల్గొంది. ఆదివారం భారీ వర్షం కురిసిన కారణంగా ముండక్కై, చూరల్‌మల ప్రాంతాల్లో ఈ గాలింపు చర్యలను నిలిపివేశారు.
డాక్యుమెంట్లు కోసం ప్రత్యేక డ్రైవ్
కొండచరియలు విరిగిపడిన ప్రాంతంలో సర్వం కోల్పోయి, ప్రాణాలతో బయటపడిన వ్యక్తులు అధికారిక డాక్యుమెంట్లు తిరిగ పొందేందుకు ప్రత్యేక డ్రైవ్‌ను సోమవారం ప్రారంభించారు. స్థానిక స్వపరిపాలన శాఖ, జిల్లా పరిపాలన, రాష్ట్ర ఐటి మిషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సర్టిఫికేట్, డాక్యుమెంట్ రిట్రీవల్ డ్రైవ్ ప్రత్యేక శిబిరాలను మెప్పాడిలోని ఎంపిక చేసిన పాఠశాలల్లో నిర్వహించారు. కొండచరియలు విరిగి పడిన ్రమాదంలో సర్వం కోల్పోయిన బాధితులు తాము పొగొట్టుకున్న డాక్యుమెంట్లు, సర్టిఫికెట్లు తిరిగిపొదేందుకు శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్టు వాయనాడ్ జిల్లా కలెక్టర్ సోషల్ మీడియాలో తెలిపారు.