బీసీ కుల గణనను బహిష్కరిస్తున్నాం..

We are boycotting BC caste enumeration..– లబాన లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్
నవతెలంగాణ – కామారెడ్డి
లభాన లంబాడీలను మధుర లంబాడీల జాబితా నుండి తొలగించి  లభనా జాతిగా గుర్తింపు ఇచ్చేవరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కుల గణనను బహిష్కరిస్తున్నాం అని లబాన లంబాడీల రాష్ట్ర అధ్యక్షుడు తాన్ సింగ్ నాయక్ అన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రోడ్ల భవనాల శాఖలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ..తెలంగాణలోని 9 నియోజక వర్గాల్లో  లభనాలు లంబాడీలు ఉన్నారని, బీసీ కుల గణనలో లాభాన లంబాడీలకు భాష, బీసీ కుల జాబితాలో గుర్తింపు ఇచ్చిన తర్వాత బీసీ కుల గణన చేయాలని మమ్మల్ని మతూర కులం నుండి లాభన కులంగా ప్రభుత్వం గుర్తించాలని అన్నారు. రాష్ట్రంలో  రెండు లక్షల మంది లభాన లంబాడీలు ఉన్నారని, మాకు బీసీ జాబితాలో గుర్తింపు ఇచ్చే వరకు బీసీ కుల గణనను బహిష్కరిస్తున్నాం అన్నారు. ఈ నెల 26 లోపల లాబాణ భాషను, కులము అప్షన్ గా  కుల గణనలో చూపించి కుల గణన చేయాలని అన్నారు.  గ్రామాలలోకి వస్తున్న అధికారులకు ఆప్షన్ వచ్చేవరకు సర్వేలో మేము పాల్గొనమన్నారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లాలోని లబానా లంబాడీలు పాల్గొన్నారు.