తక్కువ జీతంతో ఎక్కువ పనులు నిర్వహిస్తున్నాం

నవతెలంగాణ- ఆర్మూర్
తక్కువ జీతంతో ఎక్కువ పనులు నిర్వహిస్తున్నామని ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ డివిజన్ అధ్యక్షులు రమేష్ రెడ్డి అన్నారు. హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ఆలిండియా గ్రామీణ డాక్ సేవక్ యూనియన్ ఆధ్వర్యంలో బుధవారం తపాల శాఖలో విధులు నిర్వహిస్తున్న బీపీఎంలు ఏబీపీఎంలు తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలని కోరుతూ ఒక రోజు సమ్మె నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధానంగా తక్కువ జీతంతో ఎక్కువ పనులు నిర్వహిస్తున్న తమకు కేంద్ర ప్రభుత్వం తపాలా శాఖ పరిమితమైన జీతాన్ని ఇస్తూ వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని, బీపీఎంలు, ఏపీపీఎంలు  మూడు గంటలు కాదు 8 గంటలు విధులు నిర్వహిస్తున్నామని,ఉత్తరాల బట్వాడా,స్కీములపై అవగాహన కొరకు ప్రజల్లో ఉంటూ నిరంతరం సేవలందిస్తున్నామని, ప్రభుత్వం మాపై పెడుతున్న టార్గెట్లను పూర్తిచేస్తూ అనేకమైన సేవింగ్ ఖాతాలను ఓపెన్ చేస్తూ ప్రజల సహకారంతో తపాల శాఖ సేవారంగంలో అహర్నిశలు కృషి చేస్తున్న తమకు ఎలాంటి ప్రయోజనం లేదని జీతం తక్కువ పని ఎక్కువ తో విసిగి వేసారి పోతున్నామని, ఆవేదన వ్యక్తం చేశారు .40 ఏళ్లు సర్వీస్ పొందిన వారు కూడా 20,000 వేతనం కంటే ఎక్కువ తీసుకోవడం లేదని, మా బీపీఎం ఏబీపీఎం పోస్టులను రెగ్యులర్ చేస్తూ మాకు 180 వరకు పెయిడ్ లీవులు జమ చేసుకొని రిటైర్మెంట్ సమయంలో ఇచ్చే సదుపాయం కల్పించాలని, రిటర్మెంట్ తర్వాత ఫ్యామిలీ పెన్షన్ బేసిక్ లో సగం వచ్చేట్లు ఏర్పాటు చేయాలని, 6/12/24/36 సర్వీస్ లో ఉన్నవారికి అదనపు  ఇంక్రిమెంట్లు ఇవ్వాలని,ప్రతి సంవత్సరం ఒక అదనపు  ఇంక్రిమెంటు ఇవ్వాలని, కేంద్ర ప్రభుత్వ పేస్కేల్లలో మాకు కూడా పే స్కేల్లో కూర్చోబెట్టి పీ ఆర్సీ వర్తింపజేయాలని,కేంద్ర  ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా పీఆర్సీ వర్తింపజేయాలని,తమ న్యాయమైన డిపండ్లను పరిష్కరించకపోతే సమ్మెను ఉదృతం చేస్తామన్నారు.ఈ సందర్భంగా డాగ్ సేవక్ యూనియన్ తరఫున ముక్తకంఠంతో కేంద్ర ప్రభుత్వానికి తమ ఆవేదనను నివేదించారు. ఈ కార్యక్రమంలో  డివిజన్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లింబాగౌడ్, 8 సబ్ పోస్టాఫీస్ పరిధిలోని బీపీఎంలు, ఏబీపీఎంలు తదితరులు పాల్గొన్నారు.