ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తున్నాం

– బిసిటియు జిల్లా అధ్యక్షులు మాడవేడి వినోద్ కుమార్
నవతెలంగాణ-కంఠేశ్వర్ : గత పది సంవత్సరాలుగా సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా నిర్వహించాలని ప్రభుత్వాన్ని బి సి టి యుు డిమాండ్ చేస్తూ వస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సావిత్రి బాయి పూలే జయంతి కార్యక్రమంను మొట్ట మొదటగా మొదలు పెట్టింది నిజామాబాద్ బి సి టి యు తెలియజేయడానికి సంతోషిస్తున్నామని ఆమె గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలనే ఉద్దేశం తో సావిత్రిబాయి పూలే పేరు పైన గత పది సంవత్సరాలుగా మహిళా ఉద్యోగ ఉపాధ్యాయినులకు పురస్కారాలు ఇస్తున్నమన్నామని గురుువారం ప్రభుత్వం గుర్తించినందుకు చాలా సంతోషిస్తున్నామని, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.