అమ్మలను అనుబంధాల పేరిట బంధించేస్తున్నాం

– డా.హిప్నో పద్మా కమలాకర్‌, యోగా గురు బి.సరోజని రామారావు, కష్ణ వేణి
నవతెలంగాణ-సిటీబ్యూరో
అమ్మలను అనుబంధాల పేరిట బంధించే స్తున్నామని ప్రోగ్రెసివ్‌ సైకాలజిస్ట్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షురాలు డా.హిప్నో పద్మా కమలాకర్‌, యోగా గురు బి.సరోజని రామారావు అన్నారు. 12 మే మదర్స్‌ డే సందర్భంగా ఇందిరా పార్క్‌లో భారతీయ యోగ సంస్థానం ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చీకటిలో కూడా ఎలా బ్రతకాలో దారి చూపేది అమ్మేనన్నారు. పడినా మరలా పైకి లేపి యువ శక్తి ని తట్టి లేపెది అమ్మేనన్నారు. మొక్కవొని ధైర్యం తో ముందుకు దూసుకుపోమని పిల్లలకు చెపుతుందన్నారు. అమ్మ ఒక జర్నలిస్టు, న్యాయవాది, పనికత్తే, రాజకీయ వేత్త, విశ్లేషకురాలు కథకురాలు, ఆర్థిక వేత్త, ఇలా అన్నింటిలో తానై నడిపిస్తుందన్నారు. పిల్లల , భర్త గురించి, ఆ తరవాత ఉద్యోగం, అత్తమామలు, వీలయితే తల్లిదండ్రుల గురించి ఆలోచించాకే తన గురించి వారు ఆలోచిస్తారని చెప్పారు. ఒకవేళ కాసేపు సరదాగా బయలుకు వచ్చినా పిల్లల గురించో, ఇంటి గురించో ఆలోచిస్తూనే ఉంటారన్నారు. తనకు ఇది కావాలి అని స్పష్టంగా కోరుకున్న అమ్మను విచిత్రంగానే చూస్తామన్నారు. అమ్మకు కావలసిన శారీరక, మానసిక విశ్రాంతి, చల్లని మాటలను అందించాలన్నారు. అందరికి సేవచేయలేకపోయామన్న న్యూన్యత నుండి వారికి కాస్త సాంత్వన, మంచి భోజనం, ఆరోగ్యంపై శ్రద్ధ, చూపాలని తెలిపారు. ఈకార్యక్రమంలో జి.కష్ణవేణీ, డా.గీత, శ్రీలత, జ్యోతి రాజా,యశోద, వాణిశ్రీ, హరిత,సుజాత, సుభాషిణి 30 మంది మహిళలు పాల్గొన్నారు. యోగా గురు బి.రామారావు ఆధ్వర్యంలో యోగా సాధకులు రాజేంద్ర కుమార్‌ , ప్రకాష్‌, రాజేంద్ర సింగ్‌, శేఖర్‌, సుధాకర్‌ యాదవ్‌ తదితరులు అమ్మలందరిని సన్మానించారు. ఇంత చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన యోగా గురు బి.సరోజని రామారావును ఘనంగా సత్కరించారు.