డైరెక్టర్ కె.విజయభాస్కర్ చాలా విరామం చేసిన యూత్ ఫుల్ ఫన్ అండ్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ ‘జిలేబి’. పారిశ్రామికవేత్త గుంటూరు రామకృష్ణ ఎస్‌ఆర్కే ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మించారు. అంజు అశ్రాని చిత్రాన్ని ప్రజెంట్ చేశారు. విజయభాస్కర్ తనయుడు శ్రీకమల్ హీరోగా పరిచయమైన ఈ చిత్రంలో శివాని రాజశేఖర్ కథానాయికగా నటించారు.
శుక్రవారం విడుదలైన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి ఘన విజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌లో దర్శకుడు కె.విజయభాస్కర్ మాట్లాడుతూ, ‘ఇంత మంచి ఫన్ ఎంటర్‌టైనర్‌ని ఎంచుకొని, ఎక్కడా రాజీపడకుండా ఒక పెద్ద సినిమాలా నిర్మించిన నిర్మాతలు రామకష్ణ, అంజుఅశ్రానికి ధన్యవాదాలు. సినిమాపై ఉన్న నమ్మకంతో సొంతంగా రిలీజ్ చేశారు. ఈ సినిమా చదువుకునే రోజులు, హాస్టల్ డేస్‌ని మళ్ళీ గుర్తుకు తెచ్చింది. నటీనటులంతా చక్కగా నటించారు.
అందరూ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి సహకరించారు. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ అద్భుతంగా ఉంది’ అని తెలిపారు.
‘మార్నింగ్, ఈవెంట్ షోస్ కంటే నైట్ షోస్ ఇంకా పెరిగాయి. థియేటర్స్ ఇంకా పెరుగుతున్నాయి. నా మొదటి సినిమాకి ఇంత మంచి ఫీడ్ బ్యాక్ రావడం సర్‌ప్రైజ్‌గా ఉంది. అందరూ సినిమా చూడండి పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటారు. ఇది మా గ్యారెంటీ. థియేటర్‌కి రండి.. నవ్వుతూ బయటికి వెళ్తారు’ అని హీరో శ్రీ కమల్ అన్నారు. నిర్మాత గుంటూరు రామకష్ణ మాట్లాడుతూ, ‘ఈ చిత్రానికి అన్ని చోట్ల నుంచి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా డీసెంట్ మూవీ అని, కామెడీ చాలా బావుందని రివ్యూస్ వస్తున్నాయి. సినిమా ఫలితం పట్ల చాలా ఆనందంగా ఉంది’ అని చెప్పారు. ‘ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఈ సినిమా షోస్‌ని ప్రతి చోటా ఇంకా పెంచుతున్నాం’ అని నిర్మాత అంజు అశ్రాని తెలిపారు.