సమగ్రంగా విచారణ చేస్తున్నాము

– అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి…
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా ఇమాంపేట గురుకుల కళాశాలలో  ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న  విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య చేసుకోవడం పై జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట్రావ్ ఆదేశాల మేరకు సమగ్ర విచారణ చేస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి తెలిపారు. విచారణ అధికారిగా నియమించబడ్డ ఆయన ఆదివారం కళాశాలను సందర్శించి విచారణ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కేసు పై పోలీస్ శాఖ ద్వారా ఎఫ్.ఐ. ఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేపట్టడం జరుగుతుందని అలాగే వైష్ణవి  పేరెంట్స్  తో మాట్లాడడం జరిగిందని, కళాశాల ప్రిన్సిపాల్  పైచేసిన ఆరోపణలపై విచారణ చేపట్టి  విచారణలో దోషులుగా తేలితే చర్యలు తీసుకుంటామని  అలాగే సమగ్ర నివేదిక  అందిన వెంటనే ఉద్యోగం, ఎక్సగ్రేషియా చూపిన డిమాండ్ లను  ప్రభుత్వానికి అందచేసి తగు న్యాయం చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమం లో  డి.ఎస్.పి. నాగభూషణం, ఆర్.డి.ఓ కృష్ణయ్య, తహసీల్దార్ శ్యామ్ సుందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.