కాంగ్రెస్ పథకాల వల్లే చేరుతున్నాం..

నవతెలంగాణ – డిచ్ పల్లి
నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతి రెడ్డి సమక్షంలో ఇందల్ వాయి మండలంలోని గౌరరం, లింగపుర్ కు చెందిన పలువురు బిఅర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి దర్పల్లి మాజీ ఎంపీపీ ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇమ్మడి గోపి ముదిరాజ్  అద్వర్యంలో బిఅర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీ లో సోమవారం చేరారు.చేరిన వారందరికీ కాంగ్రెస్ పార్టీ కండువా వేసి పార్టీలోకి  అహ్వానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలకు  చెందిన బిఅర్ఎస్ పార్టీ ల నాయకులు, కార్యకర్తలు స్వచ్చందంగా చేరడం అభినందన మన్నారు.త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గెలుపు కోసం కృషి చేయాలని వారందరికీ సూచించారు. గ్రామంలో ఏలాంటి అబివృద్ది కావాలన్న తమవంతుగా  పాటు పడతానని, అనునిత్యం వందలాది మంది ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నట్లు వివరించారు.రొబోవు రోజుల్లో బిఅర్ఎస్ ఖాలీ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి ముదిరాజ్   మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీలను అరునురైన అమలు చేస్తుందని, మహిళలకు  రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రీ బస్సు సౌకర్యం, అరోగ్య శ్రీ కి10లక్షలు, 200వందల వరకు కరెంట్ ఫ్రీ, త్వరలో రేషన్ కార్డులు తదితర వాటిని అమలు చేస్తుందని వివరించారు. ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి విశేష కృషి చేస్తున్నారని,  మేమందరం ఆకర్షితులమై కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు గౌరరం తాజా మాజీ ఉప సర్పంచ్ గోద స్వామి, శ్రీనివాస్ రెడ్డి, బిఅర్ఎస్ గ్రామ శాఖ ఉపాధ్యక్షులు గుండ్ల నర్సయ్య, నరేష్,పల్లికోండ నర్సయ్య, విజయ్, రాజు,తో పాటు 30మంది చేరారు. తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.