నవతెలంగాణ- ఆర్మూర్
తమ పాఠశాలలో చదివే విద్యార్థిని విద్యార్థులకు చదువుతోపాటు ఆటపాటల్లో ముందు ఉంచుతున్నామని మండలంలోని అంకాపూర్ గ్రామ భార్గవి విద్యానికేతన్ హై స్కూల్ ప్రిన్సిపాల్ ప్రగతి పట్వారి అన్నారు. శుక్రవారం పాఠశాలలో రిపబ్లిక్ డే సందర్భంగా ముందస్తు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చదువులో సైతం ముందుండి తల్లిదండ్రులకు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పేరు తీసుకురావాలని కోరినారు. క్రమశిక్షణకు మారుపేరుగా భార్గవి విద్యానికేతన్ పాఠశాలలో చదివిన వారు ఉన్నత స్థాయికి ఎదగడం అభినందనీయమని పాఠశాల కరస్పాండెంట్ వెంకటేష్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం , విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.