నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మాట ఇచ్చినం.. నిలబెట్టుకుంటున్నమని, ఏకకాలంలో రైతు రుణమాఫీ కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని, రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమని పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండో విడిత లక్ష యాభై వేల రుణమాఫీ చేసిన సందర్భంగా మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్ర పాటానికి పాలాభిషేకం చేసిన అనంతరం విలేకరుల సమావేశంలో బాస వేణుగోపాల్ యాదవ్ మాట్లాడారు. రెండో విడతలో దాదాపు 6లక్షల 40 వేల మందికి లక్షన్నర చొప్పున 6190 కోట్లు రైతుల ఖాతాలో జమ చేయడం జరిగిందన్నారు.ఆగస్టు 15 లోపు పూర్తి స్థాయి రుణమాఫీ చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రైతు రాజ్యమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. గత కేసీఆర్ పరిపాలనలో రైతుల పరిస్థితి దయానియంగా ఉండేది అన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వక పోగా, వరేస్తే ఉరి అని రైతుల జీవితాలతో ఆటలకు ఆడుకున్న చరిత్ర కేసీఆర్ ది అన్నారు. దేశంలో భాజపా రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందన్నారు. నల్ల చట్టాలు తీసుకువచ్చి రైతుల నడ్డి విరిచేట్లు బిజెపి పాలన సాగుతుందన్నారు. దేశంలో రైతులకు, నిరుద్యోగులకు గాని మాట ఇస్తే నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీనే అన్నారు. కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు పడిగేలా ప్రవీణ్, డిసిసి కార్యదర్శి తక్కురి దేవేందర్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అల్లాకొండ రాజేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుచ్చి మల్లయ్య, గోపీడీ లింగారెడ్డి, ఉట్నూర్ ప్రదీప్, సింగిరెడ్డి శేఖర్, రేవతి గంగాధర్, కుందేటి శ్రీనివాస్, శ్రీరాముల మురళి, పూజారి శేఖర్, జగదీష్, ఏనుగు మనోహర్, సృజన్, గణేష్, మోహన్ నాయక్, శైలందర్, హన్మాండ్లు, అజర్, రంజిత్, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.