మేం శత్రువులం కాదు..

మేం శత్రువులం కాదు..– హర్మన్‌ప్రీత్‌పై అలీసా ఆసక్తికర వ్యాఖ్యలు
మెల్‌బోర్న్‌: ”క్రికెట్‌ అంటే పోటీ ఉండే గేమ్‌. మైదానంలో మా ఇద్దరి పాత్రలు వేరు. మా దేశాలను గెలిపించేందుకు కెప్టెన్లుగా మేం చేయాల్సింది చేస్తాం. ఇదంతా అక్కడి వరకే. ఒక్కసారి మైదానం వెలుపలికి వచ్చామంటే మా మధ్య ఏమీ ఉండదు. అందరూ అనుకుంటున్నట్టు మేం శత్రువులం కాదు” అని మైదానంలో తనపై హర్మన్‌ప్రీత్‌ విసిరిన బంతి గురించి విలేకరులు అడిగిన ప్రశ్నపై హీలీ స్పందించింది. భారత్‌లో ఆస్ట్రేలియా మహిళా జట్టు పర్యటన ముగిసింది. ఏకైక టెస్టులో టీమ్‌ఇండియా విజయం సాధించగా.. వన్డేలు, టీ20ల సిరీస్‌లను ఆసీస్‌ కైవసం చేసుకుంది. కంగారూల జట్టు మూడో టీ20 మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను చేజిక్కించుకున్న విషయం తెలిసిందే.