కార్మికుల సమస్యల పరిష్కారానికి అండగా ఉంటాం

– సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు ,మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి
నవతెలంగాణ -హుస్నాబాద్ రూరల్
గ్రామపంచాయతీ కార్మికుల డిమాండ్లు సరైనవని సమస్యల పరిష్కారానికి అండగా ఉంటమని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. బుధవారం హుస్నాబాద్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట కొనసాగుతున్న గ్రామపంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు ముందుండి పోరాడుతామని అన్నారు. గ్రామాలలో వెట్టి చాకిరీ చేస్తున్న గ్రామపంచాయతీ కార్మికులు సీఎం కేసీఆర్ కు కనబడుట లేదా అని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలతో సీఎం కేసీఆర్ కు లేఖ రాస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మంద పవన్, జాగిరి సత్యనారాయణ, గడిపే మల్లేష్, వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు.