– మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పదేండ్లపాటు బీఆర్‌ఎస్ వైద్య వ్యవస్థను పట్టించుకోకపోవడంతో పేదలకు ప్రభుత్వ వైద్యం అందుబాటులో లేకుండా పోయిందని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఈ మేరకు సోమవారం మంత్రి ట్వీట్ చేశారు. అలాంటి పరిస్థితి నుంచి వ్యవస్థను గాడిలో పెడుతున్నట్టు తెలిపారు. బీఆర్‌ఎస్ పాలనలో కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో, నీలోఫర్‌లో బాలింతల మరణాలు, డీపీఎల్ పద్ధతిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల కారణంగా మరణాలు, డెంగ్యూ మరణాలను మంత్రి గుర్తుచేశారు. తాము అధికారంలోకి వచ్చాక నెలవారీగా మెటర్నల్, పీడియాట్రిక్ మరణాలు తగ్గాయని చెప్పారు. బీఆర్‌ఎస్ నిజనిర్ధారణ కమిటీ ఈ నిజాలను ప్రజలకు చెప్పాలని మంత్రి సూచించారు.