సహకార సంఘాల ద్వారా రైతులతో పాటు అవసరమైన వారికి రుణాలు అందిస్తు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. గురువారం నుంచి ఈనెల 20వ తేది వరకు సహకార వారోత్సవాలు కొనసాగనున్నాయి. తొలి రోజు డీసీసీబీ బ్యాంక్ లో సహకర జెండాను చైర్మెన్ అడ్డి బోజారెడ్డి ప్రారంభించారు. అనంతరం సహకార గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా డీసీసీబీ చైర్మెన్ అడ్డి భోజారెడ్డి మాట్లాడుతూ… భారత దేశ తొలి ప్రధాన మంత్రి నేహ్రూ సహకార బ్యాంకులను స్థాపించారన్నారు. ఆయన జయంతి నవంబర్ 14 నుంచి 20వ తేది వారోత్సవాలను నిర్వహిస్తామన్నారు. ఇందులో బ్యాంకుల ద్వారా అందించే సేవలపై ప్రజలు, రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. ఉమ్మడి జిల్లాలో 15 వందల కోట్ల రుణాలను అందించామన్నారు. 70 సంఘాలు, 42 బ్రాంచ్ల ద్వారా సేవలను అందిస్తున్నామన్నారు. రైతులు సహకార బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోని సకాలంలో చెల్లించాలని కోరారు. కార్యక్రమంలో సీఈఓ శ్రీధర్ రెడ్డి, డీజీఎం భాస్కర్ రెడ్డి, ఏజీఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.