ఉద్యోగాలంటూ ఫోన్లు చేసే వారికి హెచ్చరిస్తున్నాం..

We are warning those who make phone calls as jobs.– ఏమైనా సందేహాలుంటే వైద్య ఆరోగ్యా శాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలి  

– డీఎంహెచ్ వో రాజశ్రీ 
నవతెలంగాణ – కంఠేశ్వర్ 
జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాలంటూ ఫోన్లు చేస్తూ 25,000/- ఇస్తే జాబ్ గ్యారంటిది అని అభ్యర్థులను, ప్రజలను మోసం చేస్తున్న అక్రమార్కులను హెచ్చరిస్తున్నట్లు నిజామాబాద్ జిల్లా  వైద్య ఆరోగ్యశాఖ అధికారిని రాజశ్రీ మంగళవారం తెలిపారు.స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకోసం మెంట్ జాబితా సిద్ధం చేసామని రూ 1. 40 లక్షలు ఇస్తే ఉద్యోగం గ్యారంటి అంటూ అనర్హులకు కొందరు ఫోన్స్ చేస్తున్నారు అని, అడ్వాన్సుగా 25 వేలు ఇచ్పే చేస్తే మాట ఉద్యోగం ఇస్తానని లేకుంటే జాబులో పేరు ఉండదని సోమవారం పలువురు అభ్యర్థులకు ఫోన్లు వచ్చినట్లు పత్రికల ద్వారా తెలిసిందన్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలియజేశారు. ఎటువంటి నియామకాలైన నియమ నిబంధనలు, మెరిట్, రోస్ట్పర్ ప్రాతిపాదికన ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని తెలియజేశారు. జిల్లాస్థాయిలో కలెక్టర్  అధ్యక్షతన ఉన్నటువంటి నియామక కమిటీ (DSC) ద్వారా అర్హులైన వారిని నియమించడం జరుగుతుందన్నారు. కావున జిల్లా ప్రజలు ముఖ్యంగా దరాఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఇటువంటి పుకార్లను నమ్మకుండా పోలీసులను ఆశ్రయించాలన్నారు. పత్రికల్లోని వచ్చిన ఫోన్ నెంబర్ 9038108948 లకు అండవాన్ కాల్ రాడార్జింగ్ మరియు కాత్ను విశ్లేషించి అవి ఎవరి వద్ద నుండి ఫోన్ కాల్స్ వచ్చాయో ఆ నంబర్ గురించి తెలుసుకోవడానికి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. అందరూ అప్రమత్తంగా ఉండి ఉద్యోగాలకోసం ఎవరూ మోసపోవద్దన్నారు. ఏమైనా సందేహాలుంటే వైద్య ఆరోగ్యా శాఖ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.