– సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు ఓరుగంటి యాదయ్య
నవతెలంగాణ-తుర్కయంజాల్
భూదాన్ భూమిని రెవిన్యూ అధికారులు రక్షించక పోతే పేదలతో గుడిసెలు వెయిస్తామని సీపీఐ రాష్ట్ర కమి టీ సభ్యులు ఓరుగంటి యాదయ్య అన్నారు. వారు మా ట్లాడుతూ..అబ్దుల్లాపూర్మెట్ మండలం, తుర్కయంజాల్ రెవిన్యూ సర్వేనెంబర్ 206 ఏ.4-29 గుంటల భూదాన భూమి ఉన్నది. ఈ భూమిని భూ కబ్జాదారుల నుంచి కా పాడాలని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 2016 నుం డి సంబంధిత అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ రెవిన్యూ అధికారుల అలసత్వం, మున్సిపాలిటీ పట్టణ ప్ర ణాళిక అధికారుల అక్రమదందా కారణంగా భూధన భూ మి కబ్జాకు గురవుతుందన్నారు. మున్సిపాలిటీ ఏర్పడిన అనంతరం భూదాన భూమిలో ఒక రియాల్టర్ ఒక ప్రజా ప్రతినిధిని అడ్డం పెట్టుకుని అక్రమ లేఔట్ చేశారన్నారు. తదానంతరం కొందరు ప్రజాప్రతినిధులు, రియల్ ఎస్టే ట్ వ్యాపారితో కుమ్మక్కై భూదాన భూమిలోనిర్మాణ అను మతులు ఇప్పించడం ద్వారా భూదాన భూమిని కబ్జా చేస్తున్నారన్నారు. ఈ విషయం అనేక పత్రికల్లో వచ్చిన ప్పటికీ ప్రజా ప్రతినిధుల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం ద్వారా కొందరు భూదాన భూమిని కాజేయాలని ప్రయత్నం చేయడం చాలా సిగ్గుచేటయిన విషయమన్నారు. ఇప్పటికైనా భూదాన భూమికి హద్దురా లను ఏర్పాటు చేసి అందులో వచ్చే అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు నిర్మాణంలో ఉన్న అన్ని అక్రమ కట్టడాలనూ తొలగించాలని డిమాం డ్ చేశారు. అక్రమ లేఔట్ ద్వారా భూదాన భూమిని కబ్జా చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారి పైన, ఒక కన్వెన్షన్ హాల్ యజమాని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీపీఐ డిమాండ్ చేస్తుంది. బుధవారం జరిగిన సర్వే ఆధా రంగా రెవెన్యూ అధికారులు వెంటనే చట్టపరమైన చర్య లు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ భూదాన భూమిని కాపాడడం కోసం అధికారులు అలసత్వం వహి స్తే కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో పాటు పేదలతో గుడిసెలు వేయిస్తామని హెచ్చరించారు. నిర్మాణ అను మతులు ఇచ్చిన మున్సిపాలిటీ టౌన్‌ప్లానింగ్ అధికా రులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.