ప్రతి గింజను కొంటాం

– పుల్కల్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌ అనంతరావు కులకర్ణి
నవతెలంగాణ-పుల్కల్‌
ఖరీఫ్‌ సీజన్లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఉల్కల్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్‌ అనంతరావు కులకర్ణి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి పంటను కొనుగోలు చేసేందుకు తమ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించామని రైతులు సద్వినియోగం చేసుకోవాల న్నారు. ఏ గ్రేడ్‌ వరి ధాన్యానికి కనీస మద్దతు ధర రూ.2,203, బి గ్రేడ్‌ వరి ధాన్యానికి రూ.2,183 ధరను ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల వద్ద ఎక్కువ నిల్వ ఉంచకుండా ఎప్పటికప్పుడు వెంటనే తూకం చేస్తున్నామన్నారు. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే లారీలతో తమకు కేటాయించిన రైస్‌ మిల్లులకు తరలిస్తున్నామన్నారు కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు కావాల్సిన కనీస మౌలిక వసతులు కల్పించామన్నారు. ఇప్పటివరకు సుమారు 20 లారీల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. సిబ్బంది రైతులకు ఇబ్బందులు కలిగిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు. సీఈఓ నాగయ్య రైతులు సిబ్బంది పాల్గొన్నారు.