– మహారాష్ట్ర పాదయాత్ర భక్తులు
నవతెలంగాణ – మద్నూర్
మహారాష్ట్రలోని కందార్ తాలూకా ప్రాంతం నుండి తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో గల అప్ప గారి మఠానికి ప్రతి సంవత్సరం పాదయాత్ర ద్వారా ఒక మహారాజ్ ఆధ్వర్యంలో భక్తులు పెద్ద సంఖ్యలో మహాశివరాత్రి రోజున బిచ్కుంద కు చేరుకుంటారు. ఇలాంటి పాదయాత్ర 13 ఏళ్లుగా కొనసాగించే భక్తులకు మద్నూర్ మండలంలోని మేనూర్ గ్రామానికి చెందిన ఇటుక బట్టి వై గోవిందు తన ఇటుక బట్టి వద్ద మహాశివరాత్రి రోజున మహారాష్ట్ర పాదయాత్ర భక్తులకు పండ్లు ఫలాలు, ఉపవాస షాప్దాన అల్పాహారంగా వారికి అందించడం మేనూర్ గోవిందు తమకు అందించే సేవలు 13 ఏళ్లుగా మరువలేక పోతున్నామని మహారాష్ట్ర పాదయాత్ర భక్తులు వై గోవిందుకు ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి సంవత్సరం లాగే శుక్రవారం మహాశివరాత్రి రోజున ఇటుక బట్టి వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేసి మహారాష్ట్ర పాదయాత్ర భజన మండలి భక్తులకు పండ్లు ఫలాలు ఉపవాస శాబ్దానాతో అల్పాహారాన్ని అందించి మహారాష్ట్ర మహారాజ్ ఆశీర్వాదాన్ని పొందారు మహారాష్ట్ర పాదయాత్ర భక్తులకు ఏర్పాటుచేసిన అల్పాహార కార్యక్రమానికి మేనూర్ గ్రామ తాజా మాజీ సర్పంచ్ విట్టల్ గురూజీ ఉప సర్పంచ్ మోహన్ ఆ గ్రామ ఎంపిటిసి సభ్యులు మందాకిని శ్రీనివాస్ గౌడ్ ధూప దీప నైవేద్య పూజారుల సంఘం జిల్లా అధ్యక్షులు అంజనప్ప ఆ గ్రామ మాజీ ఎంపీటీసీ సభ్యురాలు సొసైటీ డైరెక్టర్ ఆ గ్రామ పెద్దలు యువకులు, మహిళలు వై గోవిందు కుటుంబ సభ్యులు ఇటుక బట్టి కూలీలు పాల్గొన్నారు వందలాది మందికి ఉపవాస అల్పాహారాన్ని అందించి ప్రతి భక్తుని నుండి మంచి సేవలు అందించే దానికి మన్న నాలు పొందారు.