– పాలాభిషేక కార్యక్రమంలో లింగాయత్ లు
నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లింగాయత్ సమాజ్ అభివృద్ధి పట్ల పాటు పడుతుందని అలాంటి పార్టీని ఎల్లవేళలా మరువలేమని లింగాయత్ సమాజ్ కుల పెద్దలు యువకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు లింగాయత్ సమాజ్ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావుకు శనివారం నాడు పెద్ద ఎక్లారా లింగాయత్ సమాజ్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలుపుతూ, వారి చిత్రపటాలకు పాలభిషేకం చేశారు. ఈ సందర్భంగా లింగాయత్ సమాజ్ సంఘం పెద్దలు వెంకట్రావు మహేష్ వసంతరావు ప్రహ్లాద్ మాదయప్ప శేష రావు తదితరులతోపాటు గ్రామ పెద్దలు హనుమంతరావు దేశాయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలోని లింగాయత్ సమాజ్ కు తగిన న్యాయం చేకూరుతుందని, అధికారంలోకి రాగానే లింగాయత్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని, సమాజం కోసం పాటుపడుతున్న కాంగ్రెస్ పార్టీని ఎల్లవేళలా మరువలేమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.