అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

– ముదిరాజ్‌ చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు శివముదిరాజ్‌
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
ముదిరాజ్‌ చైతన్య వేదిక ఆధ్వర్యంలో గన్‌పార్క్‌ వద్ద తల పెట్టిన ప్రెస్స్‌మీట్‌ను శాంతియుతంగా నిర్వహించాలనుకుంటే పోలీసులు అన్యా యంగా, అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తు న్నామని ముదిరాజ్‌ చైతన్య వేదిక రాష్ట్ర నాయకులు శివ ముదిరాజ్‌ అన్నారు. ముదిరాజ్‌ లకి అడు గడుగునా అన్యాయం జరుగుతుందని, 60 లక్షలు ఉన్న ముదిరాజ్‌ ల హక్కుల కోసం పోరాటం చేస్తు న్నందుకు ముదిరాజ్‌ చైతన్య వేదిక నాయకులు రమేష్‌ముదిరాజ్‌, రాఘవేంద్రముదిరాజ్‌, సీతామహా లక్ష్మిల ను అక్రమంగా అరెస్ట్‌ చేశారు. దీన్ని యవత, ముదిరాజ్‌ సమాజం తీవ్రంగా ఖండిస్తుం దని, ముదిరాజ్‌లకు ప్రభుత్వం కనీసం మాట్లాడే హక్కులు కూడా ఇవ్వట్లేదని, తమ ఆవేదనను అవకాశం కూడా లేదా అని వారు ప్రశ్నించారు. ముదిరాజుల న్యాయమైన డిమాండ్‌ కోసం ప్రజలకు చెప్పుకుందాం అంటే పోలీసులు నిర్దాక్షిణ్యంగా అరెస్టు చేసి, ఫోన్లు లాక్కొని తమను నిర్బంధించడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ చర్యలకి తాము ఓటు రూపంలో ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు