ఎమ్మెల్సీ కవిత అరెస్టును ఖండిస్తున్నాం

– రాయపోల్ బీఆర్ఎస్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ

నవతెలంగాణ – రాయపోల్

నరేంద్ర మోడీ రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసినట్లు, సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే ఈడి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ రాయపోల్ మండల అధ్యక్షులు వెంకటేశ్వర శర్మ అన్నారు.శనివారం రాయపోల్ మండల కేంద్రంలో ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మనీ లాండరింగ్ కేసులు గత మూడు సంవత్సరాల నుండి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై నేరం అభియోగం మోపి మానసికంగా వేధింపులకు గురి చేస్తున్నారని,నిజ నిజాలు తెలియకముందే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉండగానే అరెస్టు ఎలా చేస్తారని ప్రశ్నించారు. శుక్రవారం హైదరాబాదులో కవిత ఇంటిపై తనిఖీలు చేయడానికి వచ్చి తనిఖీలు ముగియగానే ఆగ మేఘాల మీద అరెస్టు వారెంట్ జారీ చేసి అరెస్టు చేయడం బిజెపి కుట్రలో భాగమేన్నారు. నరేంద్ర మోడీ, రాష్ట్ర బీజేపీ నాయకులు తరచూ కవితను అరెస్టు చేయడం జరుగుతుందని మాట్లాడుతున్నారని హైదరాబాదులో నరేంద్ర మోడీ పర్యటన ఉండగానే కవిత అరెస్టు చేయడం రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోలేకనే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి ఇప్ప దయాకర్, నాయకులు రంగారెడ్డి, జీవన్ రెడ్డి, భార్గవ్, శ్యామ్, స్వామి, రాజు, మురళి గౌడ్, దయాకర్ రెడ్డి, రాజు గౌడ్, ప్రశాంత్, స్వామి, సందీప్ రెడ్డి, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.