– గ్రామ రెవెన్యూ అధికారుల రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు దుబాసి మాణిక్యం
నవతెలంగాణ – కామారెడ్డి

రోడ్డు మీద ప్రయాణిస్తున్నప్పుడు.ఎన్నో ప్రమాదాలు జరుగుతాయనీ, చాలామంది ప్రయాణికులకు ఇబ్బందులు కలుగుతాయనీ, వాహనాలు చెడిపోతాయి వారికి సహాయం చేసే వారిగా ఉండాలి సరైన పద్ధతిలో సమాచారం ఇవ్వాలన్నారు. అవసరమైతే ఆ ఆ టోల్ ప్లాజా దగ్గరలో ఉన్నటువంటి వారికి సమాచారం ఇవ్వాలి, స్థానికంగా ఉన్న పోలీసులకు సమాచారం ఇవ్వాలి ఇంకా ఎమర్జెన్సీ ఉంటే 108కి సమాచారం ఇవ్వాలన్నారు. ఇప్పటికైనా టోల్ ప్లాజా సిబ్బంది వాళ్ళ యజమాన్యం పద్ధతి మార్చుకొని ప్రయాణికులకు సౌకర్యార్థంగా ఉండాలని, మా రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ సిసి మీద చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. మున్మందు ఇలాంటి దాడులు గనుక జరిగితే పెద్ద ఎత్తున ఆందోళన చేసే పరిస్థితి తెచ్చుకోవద్దన్నారు. అలాంటి దాడులు జరగకుండా యజమాన్యం సరైన చొరవ చూపి ఆ రోడ్ల వెళ్తున్న ప్రయాణికులకు సహాయ సహకారాలు అందించాలని మా సంఘం తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను అన్నారు.