అగ్గిపెట్టే దొరకని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలను ఖండిస్తున్నాం

We condemn the comments of former Finance Minister Harish Rao who cannot find a lighter– హరీష్ రావు బేషరతుగా మంత్రికి క్షమాపణ చెప్పాలి 
– లేదంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటాం
– బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గండిచెర్వు వెంకన్న గౌడ్
నవతెలంగాణ – నల్గొండ కలెక్టరేట్
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవిని తృణపాయంగా వదిలేసి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర గుండె చప్పుడు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంక్ రెడ్డి పై  అగ్గిపెట్టే దొరకని మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు  చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.  తక్షణమే మంత్రి కి బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలి.లేని పక్షంలో రాష్ట్రంలో తిరగకుండా అడ్డుకుంటామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు గండిచెర్వు వెంకన్న గౌడ్ హెచ్చరించారు. నల్లగొండ పట్టణంలోని బీసీ సంఘం కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నిరంతరం పేద ప్రజల కోసం తపించే వ్యక్తి, ఎంతో మంది పేద విద్యార్థులను తన స్వంత డబ్బుతో చదివిస్తూ, ఎంతో మంది పేద ప్రజలకి వైద్య ఖర్చులు భరిస్తూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తొలి దశ ఉద్యమంలో మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా మంత్రి పదవిని స్వీకరించనని శపదం చేసిన ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ అయితే, మలి దశ ఉద్యమంలో మంత్రి పదవిని తృణపాయంగా త్యాగం చేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ రాష్ట్రం వచ్చాకే మళ్ళీ మంత్రి పదవిని స్వీకరించిన గొప్ప నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి అని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకొని,తెలంగాణ రాష్ట్రం వచ్చాక భారీ అవినీతి చేసి లక్ష కోట్లు సంపాదించిన వ్యక్తి, ఎంతో మంది విద్యార్థుల బలిదానాలకి కారణమైన,శ్రీకాంతాచారి చావుకి కారణమైన, అగ్గిపెట్టే దొరకని  మాజీ ఆర్థిక మంత్రి హరీష్ రావు  కోమటిరెడ్డి వెంకటరెడ్డి ని హాఫ్ నాలెడ్జ్ అనడం సిగ్గు చేటు అని మండిపడ్డారు. వెంటనే మంత్రి వెంకట్ రెడ్డి కి  బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో బీసీ సంఘం ఆధ్వర్యంలో  ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నేరేటి మల్లేష్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి ఈర్ల లింగస్వామి యాదవ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ చామకూరి శంకర్, పుట్ట రాకేష్ ముదిరాజ్, నకిరేకంటి అజయ్, దేవేందర్,సాయిరామ్ తదితరులు పాల్గొన్నారు.