– బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు అంగోత్ రాజునాయక్
నవతెలంగాణ-మహేశ్వరం
స్థానిక ఎమ్మెల్యే మీద మహేశ్వరం ఇన్‌చార్జి ఎంపీపీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్ మహే శ్వరం మండల అధ్యక్షులు ఆంగోత్ రాజునాయక్, నాయ కులు అన్నారు. మంగళవారం స్థానికంగా ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ మహే శ్వరం ఇన్‌చార్జి ఎంపీపీ సునీతనాయక్ స్థానిక శాసన సభ్యుల మీద చేసిన ఆరోపణలు ఖండించారు. సబ్జెక్టు లేని మాటలు మాట్లాడుతూ స్థానిక బీఆర్‌ఎస్ నా యకుల మీద, ఇతరుల మీద అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇన్‌చార్జి ఎంపీపీ పదవి త్వరలో ముగుస్తున్న కారణంగా రాజకీయ మను గడ కోసం, ఉనికి కోసం ఇలాంటి అసత్య, చిల్లర ఆరో పణలు చేస్తే పెద్దవాళ్లు కారన్నారు. హుందాత నంగా రాజకీయం చేయాలని హితవు పలికారు. ఈ సమా వేశంలో మండల కోఆప్షన్ సభ్యులు సయ్యద్ ఆ దిల్ అ లీ, స్థానిక నాయకులు కర్రోళ్ల చంద్రయ్య, మున గపాటి నవీన్, ఆనందం, సుధీర్‌గౌడ్, మహేందర్, సలీం ఎండి, తండా మాజీ సర్పంచ్ రాజు పాల్గొన్నారు.