నవతెలంగాణ – సుల్తాన్ బజార్
గ్రామీణ ప్రాంతాల్లో తాము డాక్టర్లమని చెప్పుకుంటున్న అన్ క్వాలిఫైడ్ ఆర్ఎంపీలకు సర్టిఫికెట్లు ఇవ్వాలని టిజెపి అధ్యక్షులు ఫ్రొఫెసర్ కోదండరామ్ రాష్ట్ర వైద్య ఆరోగ్యమంత్రి దామోదర రాజనర్సింహ్మను కోరడం పట్ల ఇండియన్ మెడికల్ అసోసియే షన్ సంయుక్త కార్యదర్శి డాక్టర్ టి దయాళ్ సింగ్ తీవ్రంగా ఖండించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతు అర్హత లేని ఆర్ఎంపీలు ప్రమాదకర చికిత్సతో అమాయకులైన గ్రామీణ ప్రాంత ప్రజల ప్రాణాలకు ముప్పు కలిగిస్తున్న అన్ క్వాలిఫైడ్ ఆర్ఎంపీలకు మద్దతుగా ఉన్నత విద్యావంతులైన ఫ్రొఫెసర్ కోదండరామ్ వైద్య ఆరోగ్య శాఖా మంత్రిని కలిసి సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరడం దురదృష్టకమన్నారు. ప్రస్తుతం ప్రతి జిల్లాలో 6690 మంది వైద్యులు గల మెడికల్ కాలేజీలు ఉన్నాయని, 2886 మంది ఎంబీబీఎస్, పీజీలు ఉన్నారని, ప్రతి సంవత్సరం 8 వేల మంది వైద్యులు కొత్తగా వస్తున్నారని అన్నారు. అర్హత కలిగిన వైద్యులు తెలంగాణ వ్యాప్తంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని డాక్టర్ దీన్ దయాళ్ సింగ్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్య మండలి (టీఎస్ఎంఎస్) ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల దాడులు నిర్వహించి, అమాయక పేద రోగులను చికిత్సల చేస్తూ వారి ప్రాణాలను పణంగా పెట్టి నేరాలకు పాల్పడుతున్న అర్హత లేని 90 మంది ఆర్ఎంపీలపై ఎఫ్బఆర్లు నమోదు చేసిందని వెల్లడించారు. ఇటీవల కాలంలో అమాయక రోగుల ప్రాణాలను కాపాడేందుకు అన్క్వాలిఫైడ్ ఆర్ఎంపీలను చట్టబద్ధం చేసే ఎలాంటి చర్యలనైనా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఇప్పటికైనా ఫ్రొఫెసర్ కోదండరామ్ ఇలాంటి అర్హత లేని ఆర్ఎంపీలకు తన మద్దతు విరమించుకోవాలని కోరారు.