ఆశ వర్కర్ల పైన మంత్రి హరీష్ రావు వాక్యలు ఖండిస్తున్నాం

నవతెలంగాణ కంటేశ్వర్ 

ఆశ వర్కర్ల పైన మంత్రి హరీష్ రావు మాట్లాడిన వాక్యాలను తీవ్రంగా ఖండిస్తున్నామని సిఐటియు జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మండిపడ్డారు. ఈ మేరకు శనివారం నిజామాబాద్ జిల్లా సిఐటియు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ..హైదరాబాద్ శిల్పకళా వేదికలో జీహెచ్ఎంసి లో కొత్తగా ఆశ వర్కర్లకు నియామక పత్రాలను అందజేస్తూ దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణలోనే ఆశాలకు అత్యధిక పారితోషికాలను చెల్లిస్తున్నామని హరీష్ రావు గారు అన్న వ్యాఖ్యలను తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ సీఐటీయూ కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ తెలంగాణలోని ఆశ వర్కర్లకు ఫిక్స్డ్ వేదం నిర్ణయం చేయకుండా అనేక రకాల ఇబ్బందులకు రాష్ట్ర ప్రభుత్వం గురి చేస్తున్నది. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన తెలంగాణ కంటే ఎక్కువ రూ. 10,000/లు ఫిక్స్డ్ వేతనాన్ని అనేక సంవత్సరాల నుండి అక్కడ ప్రభుత్వం అమలు చేస్తున్నది .హర్యానా రాష్ట్రంలో మన తెలంగాణ కంటే ఎక్కువ 12 వేల రూపాయల పారితోషకాలు అక్కడ ప్రభుత్వం చెల్లిస్తున్నది. ఇంకా అనేక రాష్ట్రాలలో anm నియామకాల్లో ఆశాలకు అవకాశం కల్పిస్తున్నారు. చాలా రాష్ట్రాలలో ఆశ వర్కర్లకు సైకిళ్ళు కూడా ఇచ్చారు. ఇంకా అనేక సౌకర్యాలు అనేక రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా అక్కడి ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి.కానీ తెలంగాణలో ఇన్ని సంవత్సరాలు గడిచినా ఆశ వర్కర్లు రాసే 32 రకాల రిజిస్టర్స్ ను ఇప్పటివరకు ప్రభుత్వం అందించలేదు. పిఆర్సి పెంచిన ఎరియర్స్ 7 నెలల అమౌంట్ ఇప్పటివరకు చెల్లించలేదు. ప్రయాణ చార్జీలు కూడా చెల్లించడం లేదు. కరోనా రిస్కు అలవెన్స్ కేంద్రం ఇచ్చిన వేతనాలు 16 నెలల బకాయిలు ఒక్కొక్క ఆశ వర్కర్ కు 16 వేల రూపాయలు ఇప్పటివరకు ఆశాలకు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం తన జేబులో వేసుకుంది. పని భారాన్ని విపరీతంగా పెంచుతున్నది. పనిచేయని సెల్ ఫోన్స్ ఇచ్చి నిరంతరం ఆన్లైన్ పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నది. బెదిరించి బలవంతంగా ఆశాలతో స్పుటం డబ్బాలు మోపిస్తున్నది. ఈమధ్య ప్రతినెల పారితోషికాలు కూడా ప్రభుత్వం చెల్లించడం లేదు. మొబైల్ శిక్షణ కోసం ఒక్కొక్క ఆశావర్కర్కు రూ .50,000/లు ఖర్చు పెడతామని చెప్తున్న ప్రభుత్వం. దీనికంటే ముందు ఆశా వర్కర్లకు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రూ.18,000/లు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, పని భారం తగ్గించాలని, 5జి టెక్నాలజీ మొబైల్ ను అందించాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని ఆశా యూనియన్ జిల్లా కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ జిల్లా కోశాధికారి రేణుక, జిల్లా నాయకులు జయ, అనిత, అంబిక,  రేణుక, తదితరులు పాల్గొన్నారు.