నాలుగున్నరేండ్లలో అభివృద్ధి చేసి చేశాం

నవతెలంగాణ-హుజూర్‌నగర్‌
హుజూర్‌నగర్‌ నియోజకవర్గ పరిధిలో 40ఏండ్లలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు కార్యక్రమాలు నాలుగున్నర ఏండ్లలోనే చేపట్టామని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు గురువారం పట్టణంలోని శ్రీ లక్ష్మీ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల మండలాల బూత్‌ కమిటీల సమావేశంలో ఆయన మాట్లాడారు.4000 కోట్ల రూపాయలతో నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతి ఒక్కరూ 100 ఓటర్లను కలిసి పార్టీ చేసిన పనులను వివరించాలన్నారు. అక్టోబర్‌ 31న జరిగే సీఎం బహిరంగ సభను విజయవంతం చేయాలన్నారు. రాబోయే ఎన్నికల గురించి ఎన్నికల గురించి కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో జేవీఆర్‌, ఇమ్రాన్‌, గురువయ్య, బ్రహ్మారెడ్డి, పార్టీ అధ్యక్ష కార్యదర్శులు చిట్యాల అమర్‌నాథ్‌రెడ్డి, బెల్లంకొండ అమర్‌, కౌన్సిలర్లు అట్లూరి మంజులశంభయ్య, కొమ్ము శ్రీను, ఓరుగంటి నాగేశ్వరరావు, దొంగరి మంగమ్మ, గుండాఫణికుమారి, ములకలపల్లి రాంబాబు,సీహెచ్‌.సౌజన్య, జయబాబు, గణతం సత్యనారాయణరెడ్డి, సీహెచ్‌ సైదులు, అప్పిరెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ చైర్మెన్‌ నాదెండ్ల శ్రీధర్‌, జిల్లా మార్కండేయ,పి.రాజేష్‌, భాష లలిత, నాగవేణి, నారాయణ, అలక సరిత సైదిరెడ్డి, సులోచన, కేఎల్‌ఎన్‌.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.