మాయే చేసే..

may do..నందమూరి కళ్యాణ్‌ రామ్‌ కథానాయకుడిగా నటిస్తున్న పీరియాడిక్‌ స్పై థ్రిల్లర్‌ ‘డెవిల్‌’. ‘ది బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌’ అనేది ట్యాగ్‌ లైన్‌. అభిషేక్‌ నామా ఈ మూవీని డైరెక్ట్‌ చేస్తూ నిర్మిస్తున్నారు.లేటెస్ట్‌గా ఈ సినిమా నుంచి ‘మాయే చేసే..’ అనే పాటను ఈనెల 19న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్‌ తెలిపారు. ఐకాన్‌ మ్యూజిక్‌ నుంచి ఈ సినిమాలోని పాటలను రిలీజ్‌ చేస్తున్నారు. ‘ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేస్తాయి. ‘మాయే చేసే..’ పాటను సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ పాడగా, హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతాన్ని అందించారు. సత్య ఆర్‌.వి పాటను రాశారు. ఇది ప్రారంభం మాత్రమే. ప్రేక్షకులకు ఈ మూవీ మంచి అనుభూతినిచ్చే మ్యూజికల్‌ జర్నీని ఇవ్వనుంది. రీసెంట్‌గా విడుదలైన టీజర్‌తో ఈ సినిమాపై అప్పటికే ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి. నవంబర్‌ 24న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ చేస్తున్నారు’ అని చిత్ర యూనిట్‌ తెలిపింది.