– నివేదికను పై అధికారులకు అందజేస్తానని డీఎల్ పీఓ సూచన
నవతెలంగాణ-బెజ్జంకి
మా గ్రామ శివారులో నిర్మించ తలపెట్టిన ఇథనాల్ పరిశ్రమ వద్దని హుస్నాబాద్ డివిజన్ డీఎల్ పీఓ వీరభద్రయ్య ఎదుట గుగ్గీల్ల గ్రామస్తులు ప్రాదేయపడ్డారు. ఇథనాల్ పరిశ్రమ నిర్మాణాన్ని, అనుమతులను ప్రభుత్వం రద్దు చేయాలని గ్రామస్తులు చేపట్టిన నిరవధిక దర్నాకు శుక్రవారం డీఎల్ పీఓ వీరభద్రయ్య ఎంపీఓ విష్ణు వర్దన్,పరిశ్రమ యాజమాన్యంతో కలిసి మండల పరిధిలోని గుగ్గీల్ల గ్రామ పంచాయతీ కార్యలయం వద్ద పంచాయతీ పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులతో పరిశ్రమ నిర్మాణం పై అభిప్రాయ సేకరణ చేపట్టారు.గ్రామస్తుల అభిప్రాయాల నివేదికను జిల్లా పరిపాలనాధికారికి అందజేస్తానని డీఎల్ పీఓ వీరభద్రయ్య తెలిపారు.