తెలుగు టీవీ రైటర్స్ అసోసియేషన్ సభ్యులకు ఐడెంటిటీ కార్డుల పంపిణీ ఫిల్మ్‌ఛాంబర్‌లో ఇటీవల ఘనంగా జరిగింది. దర్శకుడు క్రిష్ ముఖ్య అతిథిగా హాజరై కార్డులను పంపిణీ చేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ‘నాకు రచయితలు అంటే ఎంతో గౌరవం. టీవీ రచయితలకు ఓపిక ఎక్కువ ఉంటుంది. నవల, సినిమా కథలు రాయ డానికి చాలా సౌలభ్యం ఉంటుంది. కానీ టెలివిజన్‌కి రాయా లంటే చాలా సవాళ్లు ఉంటాయి’
అని అన్నారు.
‘రైటర్స్ కోసం రైటర్స్ అనే నినాదంతో ఈ అసోసియేషన్ మొదలుపెట్టా. అంతా ఐక్య మత్యంగా ముందుకు వెళ్లాలని కోరుతున్నా’ అని ఫౌండర్ ప్రెసిడెంట్ ఉషారాణి అన్నారు. రచయిత సాయి మాధవ్ బుర్రా మాట్లాడుతూ, ‘జాతీయ ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్ ఎంపిక కావడం, నేను మాటలు రాసిన ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రానికి ఆరు అవార్డులు రావడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ రైటర్స్ అసోసియేషన్ అతి తక్కువ సమయంలోనే ఎంతో ఘనత సాధించాం’ అని తెలిపారు