నవతెలంగాణ – డిచ్ పల్లి
సీపీఐ(యం ఎల్) మాస్ లైన్ కేంద్రం కంట్రోల్ కమిషన్ ఛైర్మెన్, కేంద్రం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అమరుడు కామ్రేడ్..రాయల చంద్రశేఖర్ సంతాప సభ పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీపీఐ(యం ఎల్) మాస్ లైన్ జిల్లా నాయకులు సిహెచ్ సాయ గౌడ్ మాట్లాడుతూ.. ఆయనది ఐదు దశాబ్దాల విప్లవ జీవితం ఎనో అటుపోట్ల మధ్య సిద్ధంత వైరుద్యాల మధ్య రాటు తేలిన మనిషే అతడు. ఎన్నో నిర్భంధాలను బెదిరింపులనూ, ఎన్ కౌటర్లనూ, జైళ్ళనూ దిక్కరించి ఉద్యమ జెండాను తమ భుజన మోసిన విప్లవొద్యమ కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ అన్నారు. ఉద్యమ బాట నల్లేరు మీద నడకలా సాగలేదని, అనేక సాధక బాధకాల మధ్య సాగిందన్నారు. ముఖ్యంగా ప్రజా ప్రతిఘటన పోరాటాలు నిర్వహిచాడు. కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ 50ఏండ్ల విప్లవ జీవితం ఎంతో గొప్పది. అచరణియమైన, అనుసరణియమైనదని వివరించారు. పార్టీకి కట్టుబడి, నిబద్దతగా పనిచేయడం అమోఘమైనదని, రాజకీయంగా, సిదంతాపరంగా సరైన ప్రజాపంథా కోసం నిలబడి తిరు అచరణిఎమైనదని వివరించారు. యాభై ఏళ్ళపాటు ఎన్నో అటుపోట్లనూ, దాడులనూ, విమర్శలనూ, వేధింపులనూ, ఎదుర్కొని, తట్టుకొని ధైర్యంగా నిలబడిన వ్యక్తి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ ఆయన దారిలో మనం నడిచి నప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వారం అవుతామన్నారు. ఈ కార్యక్రమంలో మురళి, రాజేందర్, మోహన్, లలిత, సాయిబాబా, గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు.