– ప్రజలకు అంత సంతోషంగా ఉండాలి
– పని చేసే వారికి పదవులు
– చౌటపల్లి రైతులకు అన్యాయం చేయం
– రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఆరు గ్యారంటీల హామీ ఇచ్చామని ఇచ్చిన మాట ప్రకారం అన్ని హామీలు అమలు చేస్తున్నామని రాష్ట్ర రవాణా,బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ లో ప్రజా ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాల్లో భాగంగా బుదవారం మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో ఎలాంటి ఇబ్బందులూ రావద్దని, ప్రజా సంక్షేమంలో లోటు లేకుండా చూడాలని ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో పాడి పంటలతో ఉద్యోగ అవకాశాలతో బాగుండాలని ఎల్లమ్మ తల్లిని కోరుకున్నట్లు తెలిపారు. శాసన సభ ఎన్నికలు జరిగి ఫలితాలు వచ్చి సంవత్సరం పూర్తి అయిందని ఈ సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలు జరుగుతున్నాయన్నారు. హుస్నాబాద్ ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా అవకాశం వచ్చిందన్నారు. హుస్నాబాద్ అన్ని విధాల అభివృద్ది చేసి చూపిస్తానని అన్నారు.
ప్రజా సమస్యల కోసం కార్యాలయంలో ప్రత్యేక నెంబర్ వాట్సాప్ ఉందని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.మూడు మార్కెట్ కమిటీలకు కొత్త పాలక వర్గాలు ఏర్పాటు చేసుకున్నామని, 4 దేవాలయాలకు కమిటీ లు ఇంకా రావాల్సి ఉందన్నారు పని చేసే వారికి పదవులు వస్తాయన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే వారు సిద్ధంగా ఉండాలన్నారు. మాకు ఎన్నికల్లో సహకరించిన సీపీఐ కి ధన్యవాదాలు తెలిపారు. ఇండస్ట్రీయల్ పార్క్ కోసం చౌటపల్లి గ్రామస్తులకు బలవంతం చేయడం లేదన్నారు. పారిశ్రామిక కారిడార్ కు సహకరించాలని ఎవ్వరికీ ఎక్కడ అన్యాయం చేయమన్నారు. టూరిజం పరంగా మహా సముద్రం గండి, ఎల్లమ్మ ,చెరువు సర్వాయి పాపన్న కోట ,సింగరాయ జాతర లను టూరిజం గా అభివృద్ది చేస్తామన్నారు. రాష్ట్రంలో 115 కోట్ల మంది మహిళలు ఇప్పటికీ ఉచితంగా ప్రయాణం చేశారన్నారు. ఉచిత విద్యుత్,500 గ్యాస్ ఇస్తున్నామనారు. డైట్ , కాస్మొటిక్ చార్జీలు 40 శాతం పెంచామన్నారు నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. రూ.2 లక్షల రూపాయల లోపు రుణమాఫీ పూర్తయిందని ఇంకా ఎవరికైనా కాకపోతే నాకు సమాచారం ఇవ్వండన్నారు. రూ 2 లక్షల రూపాయల పైన ఉన్నవారికి షెడ్యూల్ విడుదల అవుతుందని అ పైన ఉన్న డబ్బులు చెల్లిస్తే ఆధి మాఫీ అవుతుందన్నారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా రూ 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. ఆర్థిక విధ్వంసం జరగడంతో కొన్ని పథకాలు జాప్యం జరిగిందన్నారు. హుస్నాబాద్ ను అన్ని రంగాల్లో ముందుచుతానని చెప్పారు. ఇప్పటికీ దాదాపు వెయ్యి కోట్లకు పైగా నిధులు హుస్నాబాద్ లో వివిధ పనుల అభివృద్ధికి విడుదల అయ్యాయన్నారు. ప్రకృతి పరంగా ప్రమాద ఘంటిక మోగితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం అప్రమత్తంగా ఉంటుందన్నారు.
మాజీ సీఎం రోశయ్యకు ఘన నివాళి
హుస్నాబాద్ పట్టణంలోని మల్లె చెట్టు చౌరస్తాలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మూడవ వర్ధంతి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రోశయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు కొణిజేటి రోశయ్య రాజకీయాల్లో విశిష్టమైన వ్యక్తిత్వం కలిగిన వారన్నారు. ఎవరైనా రాజకీయాల్లో ఎదగాలని అనుకుంటే రోశయ్య ఆదర్శం తీసుకోవాలన్నారు. ప్రతిపక్షాన్ని మాటల తూటాలు పేల్చడంలో కొట్టకనే కొట్టినట్టు మాట్లాడేవారన్నారు. భవిష్యత్ లో వారిని స్ఫూర్తి తీసుకునే విధంగా ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి,హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంక చందు ,సింగిల్ విండో చైర్మన్ శివయ్య, అక్కన్నపేట మండల అధ్యక్షుడు జంగంపల్లి ఐలయ్య, ఆర్డీవో రామ్మూర్తి, తహసిల్దార్ రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.