
జిల్లాలోని ప్రతి సొసైటీల యందు సీజన్ లకు సరిపడు యూరియా అందుబాటులో ఉంచినట్టు జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ తెలిపారు. ఆలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం యందు గురువారం రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 202 సొసైటీలో ఉన్నట్టు, 75 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉండగా, 56,796 మెట్రిక్ టన్నులు వచ్చినట్టు తెలిపారు. సొసైటీల సిఈఓ లు కావలసిన మోతాదులో విడతల వారీగా రైతులకు అందజేయాలని తెలిపారు. ప్రతి బస్తా ఈపాస్ మిషన్ ద్వారానే ఇవ్వాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలూర్ ఏవో రాంబాబు, సొసైటీ సీఈఓ తోర్తి మల్లేష్, క్లర్కు ముత్యం తదితరులు పాల్గొన్నారు.