మా టార్గెట్‌ రీచ్‌ అయ్యాం

మా టార్గెట్‌ రీచ్‌ అయ్యాంవిజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘ఫ్యామిలీ స్టార్‌’ సినిమా శుక్రవారం విడుదలై అన్ని చోట్ల నుంచీ సూపర్‌ హిట్‌ రెస్పాన్స్‌ అందుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సక్సెస్‌ సెలబ్రేషన్స్‌ నిర్వహించారు. నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ,’యూత్‌తోపాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ ఎక్కువగా థియేటర్స్‌కు వస్తున్నారు. మొత్తంగా మేము టార్గెట్‌ చేసిన ఫ్యామిలీ ఆడియెన్స్‌కు రీచ్‌ అయ్యింది’ అని తెలిపారు. ‘అన్ని వర్గాల ప్రేక్షకులు తమకు సినిమా నచ్చిందంటూ మెసేజ్‌లు పంపిస్తున్నారు. నేను ఏ ఫ్యామిలీ ఎమోషన్స్‌ అయితే బలంగా నమ్మి కథ రాశానో అవి ఫ్యామిలీ ఆడియెన్స్‌కు బాగా రీచ్‌ అయ్యాయి. ఇదొక ఆణిముత్యం లాంటి సినిమా. కుటుంబం బాగుండాలని ఓపికగా కష్టపడే ప్రతి ఒక్క ఫ్యామిలీ మెంబర్‌కు అది బ్రదర్‌ కావొచ్చు, మదర్‌ కావొచ్చు, ఫాదర్‌ కావొచ్చు..వారికి అంకితమిస్తూ ఫ్యామిలీ స్టార్‌ సినిమా రూపొందించాను. చూసిన వాళ్లు మళ్లీ చూడండి. ఇలాంటి మంచి సినిమాను సొసైటీలోకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నా’ అని దర్శకుడు పరశురామ్‌ పెట్ల చెప్పారు. హీరోయిన్‌ మణాల్‌ ఠాకూర్‌ మాట్లాడుతూ, ‘ఆడియెన్స్‌తో కలిసి సినిమా చూశాను. వాళ్లు ఎమోషనల్‌గా ఫీలవుతున్నారు. క్లాప్స్‌ కొడుతున్నారు, నవ్వుతున్నారు. నేను చేసిన ఇందు, విజయ్ గోవర్థన్‌ క్యారెక్టర్స్‌తో పాటు బామ్మ, వదిన, పిల్లల క్యారెక్టర్స్‌ను వారిలోని ఎమోషన్‌ను ఫీలవుతున్నారు’ అని తెలిపారు.