పట్టణ అభివృద్ధిలో నిర్విరామ కృషి చేశాము…

We have worked tirelessly in urban development...నవతెలంగాణ – ఆర్మూర్ 

పట్టణ అభివృద్ధిలో గడిచిన 10 నెలల కాలంలో అభివృద్ధి పనులు చేసినట్టు మున్సిపల్ చైర్ పర్సన్  లావణ్య అయ్యప్ప శ్రీనివాస్ అన్నారు. పట్టణ మున్సిపల్ కార్యాలయంలో శనివారం సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కొత్త బస్టాండ్ వద్ద డ్రైనేజీని కట్టినట్లు ,రైతు బజార్లు ప్రారంభించినట్టు, పట్టణంలోని 36 వార్డులలో ఉన్న సమస్యలను స్థానిక కౌన్సిలర్ల ద్వారా తెలుసుకొని పరిష్కరించినట్టు తెలిపారు. మున్సిపల్ సిబ్బందికి డ్రెస్ కోడ్ ,ఐడి కార్డులు సైతం ఇచ్చినట్టు తెలిపారు. అభివృద్ధికి సహకరించిన ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ వినయ్ రెడ్డి లకు కృతజ్ఞతలు తెలిపారు. మరో రెండు రోజుల్లో మున్సిపల్ పాలకవర్గం పదవి విరమణ చేయనున్న సందర్భంగా సన్మాన కార్యక్రమం నిర్వహించినారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రాజు,  డి ఈ భూమేశ్వర్ , వైస్ చైర్మన్ షేక్ మొన్న , కౌన్సిలర్లు కోన పత్రి కవిత కాశీరాం, పా లె పులత,  మురళీధర్ రెడ్డి, ఆకుల రాము, నర్సారెడ్డి, చాలా ప్రసాద్ ,లిక్కి శంకర్, వనం శేఖర్, కొంతం మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.